(Local) Sun, 25 Oct, 2020

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

August 06, 2019,   3:31 PM IST
Share on:
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియులకు చేదు వార్తను చెప్పింది. దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 4377 షాపులను 3500కి తగ్గించింది. ఇక నుంచి మద్యం దుకాణాల నిర్వహణను ఏపీ బేవరేజేస్ కార్పోరేషన్ ద్వారా నిర్వహించనున్నారు. ముందుగా 20 శాతం దుకాణాలను తగ్గిస్తున్నారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలు కానుండడంతో ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. మూడు దశల్లో పూర్తిగా మద్యాన్ని నిషేదించనున్నారు.

సంబంధిత వర్గం
రాజధాని రైతుల్లో ఆనందం
రాజధాని రైతుల్లో ఆనందం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.