(Local) Sun, 17 Jan, 2021

ఇతర రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్‌

November 02, 2019,   12:37 PM IST
Share on:
ఇతర రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన ...

ఏపిలో అమలవుతోన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ జగన్  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్నటి  నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రాంతాల్లోనూ ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నిన్న ప్రారంభించారు. అనంతరం చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్ తో పాటు హైదరాబాద్‌లోని మెడ్‌కవర్‌ ఆసుపత్రుల వైద్యులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అలాగే, ఆ ప్రాంతాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతోనూ మాట్లాడారు. ఏపీకి చెందిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా 716 రోగాలకు ఆ నగరాల్లోనూ ఇకపై వైద్య సేవలు అందుతాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.