(Local) Sat, 16 Jan, 2021

అమెరికాలో జగన్ కీలక ప్రసంగం

August 19, 2019,   11:35 AM IST
Share on:
అమెరికాలో జగన్ కీలక ప్రసంగం

అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ డల్లాస్‌ వేదికపై ప్రవాసాంధ్రులనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఐ హ్యావ్ ఎ డ్రీం.. నాన్నను, నన్ను, నా కుటుంబాన్ని అమితంగా ప్రేమించే హృదయాలకు ప్రేమాభివందనాలు అంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించారు.  ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు పోషించిన పాత్ర చాలా గొప్పదన్నారు. చరిత్రాత్మక విజయం వెనుక ప్రవాసాంధ్రుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణంగా ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి మనిషి, ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

సంబంధిత వర్గం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం
నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ నియామకం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.