(Local) Mon, 16 Sep, 2019

క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

August 28, 2019,   12:48 PM IST
Views: 103
Share on:
క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ క్రీడాకారులకు శుభవార్త చెప్పారు. క్రీడారంగానికి జరుగుతున్న అన్యాయం పై సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి క్రీడా రంగానికి కొత్త శోభ తీసుకువస్తామన్నారు. ప్రతిభ ఎక్కడ ఉన్నా వారిని ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ నెల 29న క్రీడాదినోత్సవం సందర్భంగా 2014 నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారిని నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరిస్తామని ఈ కార్యక్రమం ప్రతీ ఏటా నిర్వహిస్తామని జగన్ తన ట్విట్టర్ లో తెలిపారు. ఏపీ విభజన అనంతరం జాతీయం స్థాయిలో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు నగదు బహుమతి ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  బంగారు పతకం వచ్చిన వారికి రూ.5లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్య పతకం తీసుకువచ్చిన వారికి రూ.3 లక్షలు బహుమతిగా అందజేయాలని సూచించారు. అలాగే జూనియర్, సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు,  వెండిపతకం సాధించిన వారికి రూ.75వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ప్రోత్సహాక నగదు అందజేయాలని ఆదేశించారు. ఈ నెల 29 న క్రీడా దినోత్సవం సందర్భంగా వీరందరికి వెంటనే నగదు బహుమానం అందజేయాలన్నారు. ఇక పై ప్రతి సంవత్సరం క్రీడాదినోత్సవ వేడుకలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సంబంధిత వర్గం
ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.