(Local) Thu, 14 Nov, 2019

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

October 12, 2019,   11:33 AM IST
Share on:
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. ఆయన శనివారం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా అర్థాంతరంగా పర్యటన వాయిదా పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్ మెంట్ రద్దు కావడంతో జగన్ పర్యటన రద్దు అయ్యింది. ప్రస్తుతం అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల హాడావుడి ముగిసే వరకు అపాయింట్ మెంట్ కుదరదని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 14న అమిత్ షా మహారాష్ట్ర నుంచి ఢిల్లి వచ్చే అవకాశం ఉండడంతో 14 వ తేదీనే ఢిల్లీ వెళ్లాల్సిందిగా సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అదే సమయంలో అమిత్ షాతో భేటి కావాలనుకున్నా అది కుదరలేదు. ఇలా రెండు సార్లు సీఎం జగన్ కు అమిత్ షా అపాయిట్ మెంట్ దొరకలేదు. సోమవారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు.

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.