(Local) Thu, 21 Nov, 2019

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

August 22, 2019,   11:49 AM IST
Share on:
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రణాళికా బోర్డును రద్దు చేసి దానికి బదులు నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు సమాచారం. దీని ద్వారా ప్రాంతాల మధ్య ఉన్న అసమానతను రూపుమాపి, రాష్ట్ర అభివృద్ది వేగంగా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కడప కేంద్రంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఒక ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విశాఖపట్నం రీజినల్ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలు కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాలకు కలిపి ఒక బోర్డును ఏర్పాటు చేయనున్నారు.  ఈ నాలుగు ప్రాంతీయ బోర్డులకు చైర్మన్లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియమించనున్నారు. వీరికి కేబినేట్ హోదా ఇవ్వనున్నారు. వీరు మూడు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్నారు. బోర్డులో చైర్మన్ తో పాటు వివిధ రంగాలకు చెందిన నలుగురు సభ్యులు నిపుణులుగా ఉండనున్నారు. ఈ నాలుగు ప్రాంతీయ బోర్డులు ఆయా ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ది పై ప్రభుత్వానికి నివేదిస్తారు. పారిశ్రామిక అభివృద్ది, సాగునీటి అంశాలు, ఇతర రంగాల్లో అభివృద్ది, అసమానతలు వంటి వాటి పై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. దీంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాల అభివృద్దికి అవసరమైన నిధులను మంజూరు చేయనుంది. దసరా లోపు ఈ బోర్డులు అమలులోకి రానున్నాయి.

సంబంధిత వర్గం
ఆర్టీసీ సమ్మెపై తుది నిర్ణయం..
ఆర్టీసీ సమ్మెపై తుది నిర్ణయం..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.