(Local) Wed, 18 Sep, 2019

కన్నెర్ర చేసిన ఏపీ రాజధాని రైతులు

August 26, 2019,   2:57 PM IST
Views: 95
Share on:
కన్నెర్ర చేసిన ఏపీ రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రైతులు కన్నెర్ర చేశారు. రాజధాని తరలింపు విషయంలో జరుగుతున్న ప్రచారంపై అమరావతిలో ఆందోళనకు దిగారు. రాజధానిని తరలిస్తే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రోడ్డుపై రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. రాజధాని తరలింపు విషయంపై ప్రకటనలు చేసి రైతులను కుంగదీస్తున్నారని ఫైరయ్యారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలతో రాజధాని ప్రాంతంలో ప్లాట్లకు విలువ లేకుండా తగ్గిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.