(Local) Mon, 30 Nov, 2020

నేడు ఏపీ కేబినేట్ భేటి

November 27, 2019,   11:43 AM IST
Share on:
నేడు ఏపీ కేబినేట్ భేటి

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ కేబినేట్ భేటీ కానుంది. ఈ భేటీలో వివిధ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ నవశకం పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ది చేకూర్చేందుకు కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలకు కేబినేట్ ఆమోదం తెలపనుంది. ప్రధానంగా వీటి పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 
 - జగనన్న విద్యా దీవెన పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

- టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు ముసాయిదా బిల్లుకు ఆమోదం. 
 - పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్‌) విధానంలో ఏర్పాటుచేసిన పోర్టులకు సంబంధించి ఆడిట్‌ కోసం సంస్థలను ఎంపికచేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

- సీఆర్‌డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి, వేటిని చేపట్టకూడదనే వాటి పై నిర్ణయం. 
 - వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.