(Local) Sun, 20 Jun, 2021

మద్యపాన నిషేధంలో ఏపీ మరో ముందడుగు

November 09, 2019,   12:06 PM IST
Share on:
మద్యపాన నిషేధంలో ఏపీ మరో ముందడుగు

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానని సీఎం జగన్ తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే బెల్టు షాపులను తొలగించి, 3500 మద్యం దుకాణాలను సర్కారే నిర్వహిస్తుంది. తాజాగా సీఎం జగన్ మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జనవరి 1 నుంచి నూతన బార్ల విధానం అమలు చేయాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం బార్ల సమయం ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకుగా ఉంది. దానిని ఉదయం 11 నుంచి 10 గంటల వరకుగా మార్చాలన్నారు. బార్లకు లైసెన్సు ఫీజును భారీగా పెంచాలని, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే బార్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 839 బార్లు ఉన్నాయి. 50 శాతానికి బార్లను తగ్గించడంతో 420 బార్లు ఉండనున్నాయి. క్రమేపి వాటిని కూడా తగ్గించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.