(Local) Tue, 02 Mar, 2021

మంత్రి హరీష్ రావుకు మరో కీలక బాధ్యత

September 12, 2019,   10:36 AM IST
Share on:
మంత్రి హరీష్ రావుకు మరో కీలక బాధ్యత

తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావుకు సీఎం కేసీఆర్ మరో కీలక బాధ్యతను అప్పగించారు. అసెంబ్లీలో సాగునీటి పారుదలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను హరీష్ రావుకు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత కేబినేట్ లో హారీష్ రావు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. ప్రాజెక్టుల పై హరీష్ రావుకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ సీఎం కేసీఆర్ చూస్తున్నారు. దీంతో అసెంబ్లీలో నీటి పారుదల శాఖకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారు. శాంతి భద్రతలు, సాధారణ పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను కూడా మంత్రి హరీష్ రావుకే అప్పగించారు. దీంతో ప్రభుత్వంలో హరీష్ పాత్ర మరింత పెరిగిందని అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం హోంమంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు. మండలిలో మరియు అసెంబ్లీలో ఆయన సమాధానమివ్వలేరని భావించి ఈ శాఖకు సంబంధించిన వివరణ బాధ్యతలు కూడా హరీష్ పై పెట్టారు. దీనికి సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వర్గం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.