(Local) Sun, 25 Jul, 2021

టీడీపీని వీడబోతున్న మరో కీలక నేత

August 04, 2019,   12:15 PM IST
Share on:
టీడీపీని వీడబోతున్న మరో కీలక నేత

మరో కీలక నేత టీడీపీని వీడబోతున్నారు. ఆ పార్టీకి దేవినేని అవినాష్‌ గుడ్ బై చెప్పారు. వైసీపీలోకి వస్తే అవినాష్‌కు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ ఛార్జ్‌ పదవి ఇస్తామని వైసీపీ అధిష్టానం ఆఫర్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి త్వరలోనే వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో అవినాష్  టీడీపీ తరపున గుడివాడ నుంచి కొడాలి నానిపైన పోటీ చేసి ఓడారు. అయితే తన రాజకీయ భవిష్యత్ కు భరోసా కల్పిస్తామని హామీ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం జగన్ విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి రాగానే అవినాష్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళుతున్నారు అని వస్తున్న వార్తలలో నిజం లేదని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు. ఒకవేళ అవినాష్ పార్టీ మారితే అది టీడీపీకి గట్టి ఎదురుదెబ్బే అని రాజకీయంగా జరుగుతున్న చర్చ. అయితే అవినాష్ పార్టీ మారబోతున్నారా? లేక టీడీపీలోనే కొనసాగుతారా? అనేది కాలమే సమాధానం చెప్పనుంది.

సంబంధిత వర్గం
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.