(Local) Wed, 20 Oct, 2021

రివర్స్ టెండరింగ్ ల విషయంలో జగన్ మరో కీలక నిర్ణయం

October 10, 2019,   11:30 AM IST
Share on:
రివర్స్ టెండరింగ్ ల విషయంలో జగన్ మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, తర్వాత పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లి విజయం సాధించారు.ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ ల విషయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.10లక్షల విలువైన పనులు లేదా కొనుగోళ్లను కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా చేపట్టాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ.100 కోట్లకు పైబడిన కాంట్రాక్ట్ పనులను ముందుగా జ్యుడిషీయల్ కమిటీకి నివేదించిన తర్వాతనే ఖరారు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, కొనుగోళ్లలో పారదర్శకత, సర్వీసులు ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ఇప్పటికే అధికారులతో చర్చించారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. 

ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న టెండర్ల విధానంలో ఎక్కువ మంది పాల్గొనేలా చూడాలని, టెండర్లు అంటే ఎవరూ నిరుత్సాహ పడకుండా ఉండేలా అందరికీ అన్ని అంశాలను అందుబాటులో ఉంచాలని కోరారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం జగన్ తీసుకువస్తున్న రివర్స్ టెండరింగ్ విధానంపై ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ లోకి తీసుకువస్తున్నాడని మండిపడుతున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.