(Local) Mon, 12 Apr, 2021

మద్యం నిషేధం పై ఏపీ సర్కార్ మరో నిర్ణయం

October 16, 2019,   10:25 AM IST
Share on:
మద్యం నిషేధం పై ఏపీ సర్కార్ మరో నిర్ణయం

విడతల వారీగా మద్యపాన నిషేదం చేస్తామని హామీనిచ్చిన ఏపీ సర్కార్ అందుకు తగ్గట్టుగానే పలు కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుంది. ఇప్పటికే బెల్టు షాపులను ఎత్తి వేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైన్స్ షాపులను నిర్వహిస్తుంది. వైన్స్ షాపుల సమయాన్ని కూడా తగ్గించింది. ఇక ఇప్పుడు బార్ల సమయాన్ని కూడా తగ్గించాలని అలాగే కొత్త బార్ పాలసీని అమల్లోకి తీసుకురావాలని సర్కార్ యోచిస్తోంది. 

ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్స్ ల గడువు 2022 వరకు ఉంది. కానీ దానిని రద్దు చేసి 2020 జనవరి 1 నుంచి కొత్త బార్ పాలసీని తీసుకు రావాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త బార్ల కోసం నవంబర్ మూడవ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి,డిసెంబర్ చివరి వరకు లైసెన్స్ లు జారీ చేసి జనవరి 1 నుంచి కొత్త బార్లు అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. బార్ల సంఖ్యను 30 శాతం మేర తగ్గించి, సమయాలను కూడా తగ్గించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీని పై ఎక్సైజ్ శాఖ ఒక నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.