(Local) Tue, 26 Jan, 2021

వరద పరిస్థితిని ఏరియల్‌ వ్యూ ద్వార పరిశీలించిన గవర్నర్

August 17, 2019,   2:58 PM IST
Share on:
వరద పరిస్థితిని ఏరియల్‌ వ్యూ ద్వార పరిశీలించిన గవర ...

ఏపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కృష్ణానది వరద ఉద్ధృతిని ఏరియల్ వ్యూ  ద్వారా పరిశీలించారు. రాజభవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టరులో కాకినాడ వెళ్లే ముందు వరద ప్రభావ ప్రాంతాల్లోని స్థితిగతులను పరిశీలించారు. కృష్ణానదిలో వరద ఉద్ధృతి గురించి తాజా సమాచారాన్ని అధికారులు గవర్నర్‌కు వివరించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు ఎంత పరిమాణంలో నీరు విడుదలవుతోందనేది గణాంకాలతో సహా వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు. 
అనంతరం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవంలో బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. కులపతి హోదాలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఆవరణలో ఆయన మొక్కనాటి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్నాతకోత్సవం సందర్భంగా బీహెచ్‌ఈఎల్‌ మాజీ సీఎండీ ప్రసాదరావుకు ఆయన డాక్టరేట్‌ ప్రదానం చేశారు.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.