(Local) Wed, 21 Aug, 2019

హస్తిన పర్యటనకు...ఆంధ్రప్రదేశ్ గవర్నర్

August 08, 2019,   12:49 PM IST
Share on:

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ హస్తిన పర్యటనకు వెళ్లారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ఆయన డిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుండి డిల్లీ బయలు దేరిన గవర్నర్ కు ప్రోటోకాల్ అధికారులు వీడ్కోలు పలికారు. హరిచందన్ వెంబడి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా , ఎడిసి మాధవ రెడ్డి, సెక్యురిటీ అధికారులు ఉన్నారు.  తన పర్యటనలో భాగంగా గవర్నర్ డిల్లీలో మూడు రోజుల పాటు బస చేయనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయిడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోం మంత్రి అమిత్ షా లను కలవనున్నారు. శనివారం సాయంత్రం తిరిగి విజయవాడ రాజ్ భవన్ కు చేరుకోనున్నారు.

సంబంధిత వర్గం

ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలలో ఇన్‌ఛార్జులు నియ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.