(Local) Wed, 20 Oct, 2021

పోలవరం ప్రాజెక్టు పై ముందుకే

August 30, 2019,   10:38 AM IST
Share on:
పోలవరం ప్రాజెక్టు పై ముందుకే

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లపై ముందుకే వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.దీని పై ఇప్పటికే హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం చెప్పే వరకు ముందుకు వెళ్లవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళుతున్నారో వివరించారు. కానీ తాము తదుపరి నిర్ణయం చెప్పే వరకు ముందుకు వెళ్లవద్దని మంత్రి సీఎం జగన్ కు సూచించారు.

కానీ ఏపీ సర్కార్ ఇప్పుడు ఏమీ పట్టించుకోకుండా రివర్స్ టెండరింగ్ ద్వారానే ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. బిడ్లను ఆహ్వానిస్తూ సాఫ్ట్ వేర్ ను అప్ లోడ్ చేసింది. ఈ టెండర్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.దీంతో నచ్చిన వారు టెండర్ వేసే అవకాశం ఉంది. రూ.4987.55 కోట్లకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రభుత్వం వెబ్ సైట్ లో పేర్కొంది. మరో వైపు సీఎం జగన్ నిత్యం కేంద్రం,పీపీఏలతో మాట్లాడేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లపై ఏపీ సర్కార్ మొండిగా ముందుకెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.