(Local) Sat, 24 Jul, 2021

సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ పిటిషన్

September 06, 2019,   10:20 AM IST
Share on:
సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టనుంది. ఇటీవల జగన్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ తీపి కబురు చెప్పింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి వెనక్కివాలని ఆదేశించింది. దీంతో ఈడీ జగన్ కు రూ.746 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. జగన్ సీఎం హోదాలో తన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వర్గం
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
జీవో 2430 నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.