(Local) Fri, 25 Sep, 2020

ఇమ్రాన్ ఖాన్‌ పై సెటైర్ వేసిన ఆనంద్ మహీంద్రా

August 26, 2019,   10:23 AM IST
Share on:
ఇమ్రాన్ ఖాన్‌ పై సెటైర్ వేసిన ఆనంద్ మహీంద్రా

ఇమ్రాన్‌ ఖాన్‌‌‌ ఈ ఏడాది మొదట్లో ఇరాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు .. అక్కడి సమావేశంలో మాట్లాడుతూ జర్మనీ, జపాన్ పక్కపక్కనే ఉంటాయని, సరిహద్దులు పంచుకుంటున్న రెండు దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పరిశ్రమలతో అభివృద్ధి చెందాయని చెప్పారు. దీనిపై అప్పట్లో నెటిజన్లు ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కలు చూపించారు. రెండు దేశాల సరిహద్దులు కలుసుకోవని, వీటి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుందని.. ప్రధానిగా ఉన్న మీకు అది కూడా తెలీదా? అని కామెంట్లు పెట్టారు. పైగా, జపాన్‌తో ఏ దేశానికి సరిహద్దులు లేవని.. చుట్టూ సముద్రం ఉంటుందని చెప్పారు కూడా .
ఇమ్రాన్ వ్యాఖ్యలకు సంబంధించిన ఈ  వీడియోను  చూసిన ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘దేవుడా! నీకు కృతజ్ఞతలు. ఈ వ్యక్తి మాకు చరిత్ర, జాగ్రఫీ టీచర్ కాకుండా చూశావ్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. దీంతో ఆయన ట్వీట్‌కు క్షణాల్లోనే రీట్వీట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

 

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ మత గురువు రెహ్మాన్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.