(Local) Sat, 27 Feb, 2021

కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్నవీస్

November 27, 2019,   1:10 PM IST
Share on:
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య అమృత, ఓ కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఇది శరదృతువని  ఆమె గుర్తు చేశారు. త్వరలోనే వసంతం వస్తుందని, సువాసనలు తిరిగి వస్తాయని, వాతావరణంలో మార్పు కోసం తాను ఎదురు చూస్తుంటానని అన్నారు. గత ఐదేళ్లుగా మహారాష్ట్ర ప్రజలు తనపై ఎంతో ప్రేమను చూపారని, దాన్ని మరువలేనని అన్నారు. తన శక్తికొద్దీ, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేశానని అన్నారు. కాగా, నిన్న సాయంత్రం బలపరీక్షను ఎదుర్కోవాల్సి వున్న తరుణంలో, గెలుపు సాధ్యం కాదని భావించిన ఫడ్నవీస్, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వర్గం
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.