(Local) Fri, 29 May, 2020

కరీంనగర్ కు అమిత్ షా ?

August 16, 2019,   12:08 PM IST
Share on:
కరీంనగర్ కు అమిత్ షా ?

అమిత్ షా సెప్టెంబర్ 17 న రాష్ట్రానికి రానున్న సందర్బంగా బీజేపీ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై రాష్ట్ర క్యాడర్ మల్లగుల్లాలు పడుతోంది. వివిధ పార్టీల నుంచి ప్రముఖులు ఆ రోజు అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బహిరంగ సభకు ముందుగా అనుకున్న నిజామాబాద్ నే కాకుండా కరీంనగర్ ను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. కరీంనగర్ లో బీజేపీకి మంచి క్యాడర్ ఉండటం, పైగా అక్కడ ఎంపీగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఉండటంతో కరీంనగర్ ను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే కరీంనగర్ లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి లాభించటం ఖాయం.
 

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.