(Local) Tue, 10 Dec, 2019

తెలుగు రాష్ట్రాలను ప్రశంసించిన అమిత్‌షా

August 27, 2019,   11:26 AM IST
Share on:
తెలుగు రాష్ట్రాలను ప్రశంసించిన అమిత్‌షా

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి కేంద్ర హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరిజు వేసేందుకు కేంద్ర హోంశాఖ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో భాగంగా అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, పోలీస్ అధికారులతో పలు అంశాల పై చర్చించారు. మావోయిస్ట్ సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.