(Local) Tue, 27 Oct, 2020

శివసేనపై మండిపడిన అమిత్ షా

November 28, 2019,   9:47 AM IST
Share on:
శివసేనపై మండిపడిన అమిత్ షా

శివసేనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శివసేన నేతలు అవమానించారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన వరుస ట్వీట్లు చేశారు. సీఎం పదవిపై వ్యామోహంతోనే బీజేపీ కూటమి నుంచి శివసేన విడిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో శివసేన పార్టీకి సీఎం పదవిపై ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. వంద సీట్లు గెలిచిన ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి సీఎం పదవి దక్కాలని.. కానీ శివసేనకు ఇవ్వడమేంటని అమిత్ షా ప్రశ్నించారు. ఈ విషయంపై సోనియా, శరద్ పవార్ సమాధానం చెప్పాలన్నారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.