(Local) Mon, 28 Sep, 2020

ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న అమిత్ షా

August 24, 2019,   12:36 PM IST
Share on:
ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న అమిత్ షా

శనివారం ఉదయం హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 70 బ్యాచ్ కు చెందిన 92 మంది ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ...“ఐపీఎస్ కాగానే లక్ష్యం పూర్తయినట్టు కాదు. నేటి నుంచే సవాళ్లను ఎదుర్కోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ వ్యవస్థకు ఓ రూపు రేఖనిచ్చాడు. ఆయన కృషి వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది. స్వదేశీ సంస్థానాల విలీనంలో ఆయన కృషి మరువలేనిది. పోలీస్ వృత్తి పవిత్రమైనది. దేశంలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ధైర్యంగా విధులు నిర్వహించాలి. దేశం కోసం ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలర్పించారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంతో పటేల్ ఆశయం నెరవేరింది.” అని అమిత్ షా అన్నారు.

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.