(Local) Sun, 20 Oct, 2019

హైదరాబాద్ లో అమెజాన్ క్యాంపస్ ప్రారంభం

August 21, 2019,   4:21 PM IST
Share on:
హైదరాబాద్ లో అమెజాన్ క్యాంపస్ ప్రారంభం

హైదరాబాద్ నానక్‌రాంగూడలో అమెజాన్ క్యాంపస్ ప్రారంభమైంది. అమెజాన్ క్యాంపస్ ను తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ను ఏర్పాటు చేసింది. అమెజాన్ క్యాంపస్ ను పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అమెజాన్‌లో ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వచ్చే నెలాఖరుకు అమెజాన్‌లో ఉద్యోగుల సంఖ్య పది వేలకు పెరగనుంది. హైదరాబాద్ క్యాంపస్ నుంచి అంతర్జాతీయ కార్యకలాపాలను అమెజాన్ నిర్వహించనుంది. 2016 మార్చి 31న అమెజాన్ క్యాంపస్‌కు అప్పటి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు.

సంబంధిత వర్గం
స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలా ???
స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలా ???

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.