(Local) Wed, 20 Oct, 2021

దేవేంద్ర ఫడ్నవీస్ మెజార్టీ నిరూపించుకోలేరు: ఎన్సీపీ

November 25, 2019,   8:39 AM IST
Share on:
దేవేంద్ర ఫడ్నవీస్ మెజార్టీ నిరూపించుకోలేరు: ఎన్సీప ...

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మెజార్టీ నిరూపించుకోలేరని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. ఫడ్నవీస్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ సాయంత్రం వరకు ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తిరిగి సొంత గూటికి చేరుకుంటారని తెలిపారు. అజిత్ పవార్ అతి పెద్ద పొరపాటు చేశారని.. వాస్తవ పరిస్థితులను ఆయనకు వివరించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరేందుకు ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని.. చేసిన తప్పును వీలైనంత త్వరగా తెలుసుకోవాలని హితవు పలికారు.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.