(Local) Sun, 20 Oct, 2019

దేశమంతా హై అలెర్ట్ ప్రకటించిన కేంద్రం

August 20, 2019,   1:16 PM IST
Share on:
దేశమంతా హై అలెర్ట్ ప్రకటించిన కేంద్రం

గుజరాత్ తీరం నుంచి నలుగురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అప్ఘనిస్థాన్ పాస్ పోర్టులతో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ సహా నలుగురు తీవ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారని సమాచారం. వారు స్వాతంత్య్ర దినోత్సవం రోజునే విధ్వంసానికి ప్రణాళిక వేసినా దేశమంతా అలర్ట్ గా ఉండడంతో ఉగ్రవాదులు ఎటువంటి చర్యలకు పాల్పడలేదు. ప్రస్తుతం వారు ఏ క్షణంలోనైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. గుజరాత్, రాజస్థాన్,మహారాష్ట్ర పై వారు దృష్టి పెట్టారని తెలుస్తోంది. దేశంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటల్స్, రద్దీగా ఉండే ప్రాంతాలలో  తనిఖీలు చేపట్టాలని ఐబీ ఆదేశించింది. దీంతో దేశ వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు.

సంబంధిత వర్గం
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు
ప్రధాని మోడీ టర్కీ టూర్ రద్దు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.