(Local) Fri, 22 Oct, 2021

శ్రీలంక నుండి చెన్నైకి ఎంటర్ అయిన ఉగ్రవాదులు

August 23, 2019,   2:03 PM IST
Share on:
శ్రీలంక నుండి చెన్నైకి ఎంటర్ అయిన ఉగ్రవాదులు

లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు శ్రీలంక ద్వారా భారత్‌లోకి ప్రవేశించారన్న ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరికలతో  తమిళనాడులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు తమిళనాడులో గాలింపును ముమ్మరం చేశారు కాగా ముష్కరుల్లో ఒకరు పాకిస్థానీ కాగా.. ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా తెలుస్తోంది. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి.

రద్దీ ప్రదేశాలు, ప్రముఖ రాజకీయ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని వీరు దాడులకు పాల్పడే ప్రమాదముందని పేర్కొన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేశారు. కొయంబత్తూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలోని అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. అటు చెన్నైలో బలగాలను పెంచారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌, ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వర్గం
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు అరెస్ట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.