(Local) Sat, 24 Jul, 2021

ప్రైవేటుపరం కానున్న 24 రైల్వే రూట్లు

October 10, 2019,   2:48 PM IST
Share on:
ప్రైవేటుపరం కానున్న 24 రైల్వే రూట్లు

దేశంలోని రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల దేశంలోని తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఈ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక దేశంలోని 50 రైల్వే స్టేషన్లు, 150 రైళ్లను ప్రైవేటుపరం చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్‌కు రాసిన ఒక లేఖలో తెలియచేశారు.

కొన్ని పాసింజర్ రైళ్లను ప్రైవేటు ట్రెయిన్ ఆపరేటర్లకు అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం మీకు తెలుసునని, తొలి దశలో 150 రైళ్లను ప్రైవేటుపరం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని అమితాబ్ కాంత్ తన లేఖలో పేర్కొన్నారు. ఇక 50 రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయానికి సంబంధించి రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో తాను సుదీర్ఘంగా చర్చించానని, ఈ విషయానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కూడా తాను కోరానని నీతి ఆయోగ్ సిఇఓ తన లేఖలో పేర్కొన్నారు.

ప్రైవేటుపరం కానున్న 24 రూట్లను ప్రాథమికంగా ఖరారు చేసినట్లు వర్గాలు చెప్పాయి. ఈ రూట్లలో దూర ప్రయాణం, రాత్రి ప్రయాణం, ఇంటర్-సిటీ రైళ్లు, సబర్బన్ రైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి పూట, దూర ప్రయాణం సాగించే రూట్లలో ఈ రైళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.