(Local) Sun, 20 Sep, 2020

సుష్మాస్వరాజ్‌కు నివాళిలర్పిస్తూ భావోద్వేగానికి గురయ్యిన అద్వానీ

August 07, 2019,   12:53 PM IST
Share on:
సుష్మాస్వరాజ్‌కు నివాళిలర్పిస్తూ భావోద్వేగానికి గు ...

బిజెపి అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ కుటుంబం సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సుష్మ కుమార్తె బన్సూరిని ఓదార్చుతూ ఆడ్వాణీ కుమార్తె ప్రతిభ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా సుష్మాస్వరాజ్ మృతితో దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటనిఅడ్వాణీ ఓ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని అన్నారు. సుష్మ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాకు అత్యంత ఆప్తురాలైన సుష్మాజీ ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను బిజెపి తొలినాళ్ల నుంచి మమేకమవుతూ ఎంతో ప్రతిభావంతురాలిగా సుష్మ పేరుతెచ్చుకున్నారు. 80వ దశకంలో నేను బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టీమ్‌లో ఎంతో చురుకుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం నాకింకా గుర్తుంది. అని అడ్వాణీ గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వర్గం
అరుణ్‌ జైట్లీని పరామర్శించిన అడ్వాణీ
అరుణ్‌ జైట్లీని పరామర్శించిన అడ్వాణీ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.