(Local) Sat, 24 Jul, 2021

నోటా కంటే తక్కువ ఓట్లతో ఆప్ ఘోరపరాజయం

October 25, 2019,   7:49 PM IST
Share on:
నోటా కంటే తక్కువ ఓట్లతో ఆప్ ఘోరపరాజయం

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ఏమాత్రం సత్తా చూపలేకపోయింది. మహారాష్ట్రలో పోటీ చేసిన 24 స్టానాలు, హరియాణాలో పోటీ చేసిన 46 స్థానాలు మొత్తం 70 అసెంబ్లీ సీట్లలోనూ ఆ పార్టీ అభ్యర్థలు ఓటమి చవిచూశారు. రెండు రాష్ట్రాల్లోనూ నోటా కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీకి రావడం గమనార్హం. హరియాణాలో ఆ పార్టీకి 0.48 శాతం ఓట్లు రాగా.. నోటాకు 0.58 శాతం ఓట్లు పోలయ్యాయి. మహారాష్ట్రలో నోటాకు 1.37శాతం ఓట్లు రాగా, ఆప్‌కు కేవలం 0.11 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. చీపురు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మందికి వెయ్యి ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.