(Local) Sat, 24 Jul, 2021

హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆశాభంగం

October 24, 2019,   2:19 PM IST
Share on:
హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆశాభంగం

హరియాణాలో ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీకి తీవ్రఆశాభంగం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము ఆ రాష్ట్రంలో బలంగా ఉన్నామని చెప్పిన ఆమ్ ఆద్మీ వెలువడుతున్న ఫలితాలను చూసి తలపట్టుకుంటోంది. ఈ ఫలితాలు ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 0.45 శాతం ఓట్లు మాత్రమే దక్కినట్లు తెలుస్తోంది. దీనికిముందు హరియాణాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టిఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించి, అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఒక్క లోక్‌సభ సీటును కూడా దక్కించుకోలేకపోయింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.