(Local) Mon, 27 Sep, 2021

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం పెంపు

November 06, 2019,   2:41 PM IST
Share on:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల  కనీస వేతనం  పెంపు

ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ. 8000 పెంచుతూ కేంద్రం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 10వ తేదీ తర్వాత జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన తరుణంలో మార్కెట్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18,000 తోపాటు 2.57 రెట్ల ఫిట్‌మెంట్ ఉండాలి. అయితే ఉద్యోగులు మాత్రం కనీస వేతనాన్ని రూ. 26,000కు పెంచాలని, ఫిట్‌మెంట్‌ను 3.68 రెట్లు చేయాలని డిమాండు చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందే ఈ పెంపును కేంద్రం ప్రకటిస్తుందని ఉద్యోగులు ఆశించారు. అయితే అటువంటి ప్రకటన రాలేదు. దీపావళి ముందు కూడా ఈ పెంపుదల ఉంటుందని ఆశించినప్పటికీ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. కాని, కరవు భత్యాన్ని మాత్రం పెంచుతూ దీపావళి కానుకగా కేంద్రం ప్రకటించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.