(Local) Mon, 23 Sep, 2019

22 మంది ఐటి శాఖ అధికారుల తొలగింపు

August 26, 2019,   12:51 PM IST
Views: 84
Share on:
22 మంది ఐటి శాఖ అధికారుల తొలగింపు

 అవినీతి, తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న  22 మంది ఐటి శాఖ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇదివరకు 12 మంది ఆదాయం పన్ను శాఖ అధికారులతో సహా మొత్తం 27 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు చెందిన సీనియర్ అధికారులను ఆర్థిక మంత్రిత్వ శాఖ తొలగించింది. అవినీతి అధికారులను ఉద్యోగాలలో కొనసాగనివ్వరాదన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ చర్యలు చేపట్టింది. అవినీతి, అక్రమాలు, సిబిఐ దాడులు తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్న 22 మంది సూపరింటెండెంట్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ర్యాంకులో ఉన్న 22 మంది సీనియర్ అధికారులను తప్పనిసరిగా పదవీ విరమణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సిబిఐసి) నిర్ణయించినట్లు ఆ శాఖ ప్రకటించింది.

సంబంధిత వర్గం
ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది - నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది - నిర్మలా సీతారామన్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర ఆర్థిక మంత్ర ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నకేంద్ర ఆర్థిక మంత్ర ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.