(Local) Sat, 23 Oct, 2021

20 కోట్ల‌తో క‌న‌క దుర్గ విగ్ర‌హం

September 26, 2019,   4:39 PM IST
Share on:
20 కోట్ల‌తో క‌న‌క దుర్గ విగ్ర‌హం

దేవీ న‌వ‌రాత్రులు వ‌చ్చేస్తున్నాయి. శ‌ర‌న్న‌వ‌రాత్రుల కోసం బెంగాల్ సిద్ద‌మైంది. కోల్‌క‌తాలో దుర్గాదేవి భారీ స్వ‌ర్ణ విగ్ర‌హాన్ని త‌యారు చేస్తున్నారు. 20 కోట్ల విలువైన బంగారంతో ఆ విగ్ర‌హాన్ని రూపొందిస్తున్నారు. సెంట్ర‌ల్ కోల్‌క‌తాలో ఈ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌నున్నారు. 13 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్ర‌హాన్ని సంతోష్ మిత్ర స్క్వేర్ వ‌ద్ద ఉన్న మండ‌పంలో ఏర్పాటు చేయ‌నున్నారు. మేలిమి బంగారంతో విగ్ర‌హాన్ని తయారు చేస్తున్నామ‌ని, మా క‌న‌కదుర్గ ఈమే అని, సుమారు 50 కిలోల బంగారాన్ని వాడ‌నున్న‌ట్లు స్థానికులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం తులం బంగారం ధ‌ర 40 వేల వ‌ర‌కు ఉన్న‌ది. దీంతో ఈ విగ్ర‌హం ఖ‌రీదు దాదాపు 20 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.