(Local) Fri, 22 Oct, 2021

పాక్‌ చెరలో ఇద్దరు భారతీయులు..

November 19, 2019,   12:15 PM IST
Share on:
పాక్‌ చెరలో ఇద్దరు భారతీయులు..

భారత సరిహద్దులు దాటుకొని పాకిస్తాన్ వెళ్లిన ఇద్దరు భారతీయ యువకులను అక్కడి భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. దీంట్లో ఒకరు  విశాఖపట్టణానికి చెందిన యువకుడు ప్రశాంత్ కాగా మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారి లాల్‌... వీరిరువురు పాస్‌పోర్టు, వీసా లేకుండా వీరు తమ దేశంలోకి ప్రవేశించినట్టు పాక్ అధికారులు చెబుతున్నారు. ఇద్దరిని విచారించిన పాక్ అధికారులు ఓ వీడియో రికార్డు చేసి విడుదల చేశారు. వీరు ఇద్దరు అక్కడికి ఎందుకు వెళ్లినట్టు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరిపైన అక్కడి చట్టంలోని 3344 కింద అభియోగాలు నమోదయ్యాయి. కొంత కాలంగా ప్రశాంత్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆమె స్విట్జర్ ల్యాండ్‌లో ఉంటోదని అందుకే అటుగా వెళ్లేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 2017 ఏప్రిల్ నుంచి  ప్రశాంత్ కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కూడా పెట్టినట్టు వెల్లడించారు. మీడియాలో వచ్చిన కథనాలు చూసే తాము అతడి గురించి తెలుసుకున్నామని అంటున్నారు. 

ఇంతకీ ప్రశాంత్ మరో వ్యక్తితో కలిసి పాక్ ఎందుకు వెళ్లిందనేది తెలియాల్సి ఉంది. కొడుకు పాక్ చెరలో ఉండటంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కొడుకును విడుదల చేసేందుకు విదేశాంగశాఖ చొరవ చూపాలని కోరుతున్నారు. 

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.