(Local) Tue, 27 Oct, 2020

మహిళల భద్రత కోసం 16వేల సీసీ కెమెరాలు

October 24, 2019,   12:00 PM IST
Share on:
మహిళల భద్రత కోసం 16వేల సీసీ కెమెరాలు

మహిళల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిర్భయ ఫండ్‌లో భాగంగా బెంగళూరు నగరంలో 16వేల క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టెలివిజన్స్‌ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. ఈ విషయంపై కర్ణాటక మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక  శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి జెసి. మధుస్వామి మాట్లాడుతూ... బెంగుళూరు నగరంలో అదనంగా 16వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు పోలీసులు జీఐఎస్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నారని, వాటి ఆధారంగా నగరంలో అదనంగా 16 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

నిర్భయ ఫండ్‌ కింద గత మూడు సంవత్సరాల్లో సేఫ్‌ సిటి ప్రాజెక్టులో భాగంగా బెంగళూరులో రూ.667 కోట్ల నిధులు సద్వినియోగం అయ్యాయని మంత్రి మధుస్వామి వివరించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎమర్జెన్సీ లైట్‌, పానిక్‌ బటన్‌, లౌడ్‌ స్పీకర్‌ సైరన్‌తో సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందులా ప్రత్యేకమైన సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమాచారం అందుకోవడానికి ప్రత్యేకంగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. బెంగుళూరులో మహిళలు సేచ్ఛగా సంచరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇప్పుడున్నవి కాకుండా అదనంగా 16వేల కెమెరారాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటికి అత్యాధునిక టెక్నాలజీతో చాలా ప్రత్యేకతలున్నాయన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.