(Local) Fri, 23 Jul, 2021

ఫరూక్ అబ్దుల్లాను కలుసుకున్న ఎన్సీ ప్రతినిధులు

October 07, 2019,   12:13 PM IST
Share on:
ఫరూక్ అబ్దుల్లాను కలుసుకున్న ఎన్సీ ప్రతినిధులు

జమ్మూ కాశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన 15 మంది సభ్యుల ప్రతినిధి బృందం ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఆదివారంనాడు కలుసుకుంది. రెండు నెలలుగా గృహనిర్బంధంలో ఉన్న ఫరూక్‌ను ఆయన నివాసంలో ప్రతినిధి బృందం కలుసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ సింగ్ రాణా నేతృత్వంలోని ప్రతినిధి బృందం నిన్న  ఉదయం శ్రీనగర్‌కు చేరుకుని నేరుగా ఫరూక్ నివాసానికి వెళ్లింది. ఫరూక్‌ను కలుసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎన్సీ ప్రతినిధి బృందం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కోరగా, ప్రభుత్వ యంత్రాగం అనుమతించింది.ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్‌ 4వ తేదీ నుంచి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాతోపాటు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలను ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.  మరోవైపు, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని కలుసుకోవడానికి ఆ పార్టీకి చెందిన బృందానికి అనుమతి లభించింది. వీరు ఎప్పుడు కలుసుకునేది ఖరారు కాలేదు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.