(Local) Sun, 20 Jun, 2021

తెలంగాణ రాష్ట్రానికి 11 మంది యువ ఐపీఎస్‌లు

November 26, 2019,   11:49 AM IST
Share on:
తెలంగాణ రాష్ట్రానికి 11 మంది యువ ఐపీఎస్‌లు

తెలంగాణ రాష్ట్రానికి 11 మంది యువ ఐపీఎస్‌లు రానున్నారు. జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న 71వ బ్యాచ్‌ ఐపీఎస్‌ల కేడర్‌ కేటాయింపులను కేంద్ర హోంశాఖ ఇటీవలే పూర్తిచేసింది. వీరిలో అత్యధికంగా 11 మందిని తెలంగాణకు కేటాయించింది. ఈ స్థాయిలో ఐపీఎస్‌ల కేటాయింపు ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఉమ్మడి ఏపీలో గరిష్ఠంగా ఆరుగురు ఐపీఎ్‌సలను కేటాయించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఐపీఎస్‌ల అవసరం పెరిగింది. ఐపీఎస్‌ల కొరత కారణంగా కొన్ని జిల్లాలకు ఎస్పీలుగా నాన్‌-కేడర్‌ అధికారులు పనిచేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.