
సెప్టెంబర్ 7వ తేదీనాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్నందున ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ది వంటి విషయాలపై అధ్యయనం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నాడు ఈ సమావేశం జరిగింది.
సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఇప్పటివరకూ నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలపై సమీక్ష, ఉభయగోదావరి జిల్లాల్లో ఇటీవల జరిగిన పవన్ కల్యాణ్ పర్యటన, రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణపై చర్చ జరిగింది. సెప్టెంబర్ మాసాంతానికి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలన్నింటినీ పూర్తి చేసి, పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈలోగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి వివరాలను క్రోడీకరించి సిద్ధపరచాలని, స్థానిక నాయకులకు తెలియచేయాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై అధ్యయనం చేయడానికి 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో 30 మంది సభ్యులను నియమించారు.
సెప్టెంబర్ మూడో వారం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమలలో పార్లమెంట్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్రలోని అయిదు పార్లమెంట్ సెగ్మెంట్ల సమావేశాలు విశాఖపట్నంలోను, రాయలసీమలోని ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్ల సమావేశాలు రాయలసీమలోని ప్రధాన కేంద్రంలో నిర్వహిస్తారు. ఈ సమావేశాల అనంతరం అక్టోబర్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లు ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న సమావేశాలపై సమీక్షిస్తూ మనం ఎన్నికల్లో ఓటమికి గురైనా కార్యకర్తల్లో ధైర్యం ఏ మాత్రం సడలలేదని శ్రీ పవన్ కల్యాణ్ గారు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశాలకు హాజరవుతున్న కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే పార్టీ భావజాలంతో వారెంత మమేకమయ్యారో అర్థమవుతోందనీ, ఇప్పటి వరకూ జరిగిన సమావేశాలు తనకు సంతృప్తినిచ్చాయి అన్నారు.
ఆశావాహ దృక్పథంతో ఉన్న కార్యకర్తల మనసును గెలుచుకోవడానికి నాయకులు కొంత ఓర్పుతో పని చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. వారికి కష్టం ఉన్నప్పుడు మీకు అండగా మేమున్నాం అనే భరోసా ఇవ్వాలన్నారు. తమను అలక్ష్యం చేశారనే భావన వారికి రానీయకూడదని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక జనసేన కార్యకర్తలను వేధిస్తూ కేసులుపెడుతున్నందున, కార్యకర్తలకు అండగా ఉండేందుకు పార్టీలోని లీగల్ విభాగాన్ని బలోపేతం చేయాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రతి జిల్లాలోను లీగల్ బృందాలను కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
ఇటీవల చోటు చేసుకున్న రాజోలు శాసన సభ్యులు శ్రీ రాపాక వరప్రసాద్ పై కేసులు, అరెస్టు, తదనంతరం వచ్చిన బెయిలు, అప్పుడు చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు చూపిన చొరవను రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ప్రశంసించారు. పార్టీ అధ్యక్షులు అవసరమైతే రాజోలు వస్తాను అని ప్రకటించటంతో అధికారుల్లో తక్షణం కదలిక వచ్చి సమస్య చల్లారిందనీ కమిటీ సభ్యుడు శ్రీ కందుల దుర్గేష్ వివరించారు. అదే విధంగా పార్టీ అధ్యక్షుల ఉభయగోదావరి జిల్లాల పర్యటన గురించి శ్రీ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ రాజమండ్రి నుంచి భీమవరం వరకుజరిగిన రోడ్ షో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందనీ, భీమవరం, నర్సాపురం కార్యకర్తల సమావేశం, అనంతరం క్యాన్సర్ తో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో జనసేన పార్టీ పట్ల మరింత సానుకూలత ఏర్పడేందుకు దోహదపడ్డాయని చెప్పారు.
తొలుత సమావేశాన్ని ప్రారంభించిన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు వారాల్లో కమిటీ సభ్యులు చేయాల్సిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు పరిపాలనలో చోటు చేసుకొంటున్న పరిణామాల గురించి సభ్యులకు వివరించారు. ఒక్కో సభ్యుడు ఏయే పనులు నిర్వర్తించాలో అంశాల వారీగా వారికి వివరించారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పి.రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు శ్రీ కోన తాతారావు, శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ కందుల దుర్గేష్, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ టి.శివశంకర్, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరి ప్రసాద్ పాల్గొన్నారు.
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM
-
నూతన బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
29 Nov 2019, 3:49 PM
-
బీసీ సంక్షేమ శాఖ అధికారులపై స్పీకర్ ఆగ్రహం
29 Nov 2019, 2:25 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
28 Nov 2019, 3:55 PM
-
చంద్రబాబు పర్యటనను వ్యతిరేకించిన రాజధాని రైతులు
28 Nov 2019, 2:05 PM
-
చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై వైసిపి నేతల దాడి
28 Nov 2019, 2:02 PM
-
మద్యపాన నిషేధం పై మరో నిర్ణయం
28 Nov 2019, 8:56 AM
-
నీరా అనుబంధ ఉత్పత్తులపై మంత్రి సమీక్ష
27 Nov 2019, 1:44 PM
-
ఏనుగుపిల్లను పోలిన శునకo
27 Nov 2019, 11:56 AM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఏపి డీజీపి పై కేంద్ర హోం సెక్రటరీకి ఫిర్యాదు
30 Nov 2019, 1:11 PM
-
ఫాస్ట్ టాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
30 Nov 2019, 1:00 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
బిజెపి నేతను కలిసిన అజిత్ పవార్
30 Nov 2019, 12:41 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం
29 Nov 2019, 4:49 PM
-
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
29 Nov 2019, 4:40 PM

ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.