(Local) Mon, 22 Jul, 2019

కోహ్లీసేన ఆరెంజ్ కలర్ జెర్సీని ధరించనుందా?

May 29, 2019,   1:10 PM IST
Share on:

రేప‌టి నుండి వరల్డ్‌కప్ క్రికెట్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన జట్లన్నీ ఇంగ్లాండ్ చేరుకున్నాయి. అలాగే వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా డ్ర‌స్ కోడ్ విష‌యంపై  సోషల్‌మీడియాలో వైరల్ అయింది. వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల్లోని ఒక మూడు మ్యాచ్ ల్లో టీమిండియా నారింజ రంగు జెర్సీతో బరిలోకి దిగనుందనే వార్త వైర‌ల్ అయ్యింది.   ఆప్ఘనిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా ఈ డ్ర‌స్ కోడ్ తో బరిలోకి దిగనుందనే వార్త పై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయక పోవడం విశేషం. టీమిండియా కెప్టెన్ కోహ్లీ  ఆరెంజ్ జెర్సీ వేసుకుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.