(Local) Sat, 14 Dec, 2019

జాతీయ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో తెలంగాణ దుమ్మురేపింది

November 15, 2018,   12:49 PM IST
Share on:
జాతీయ బాస్కెట్‌బాల్‌  పోటీల్లో తెలంగాణ దుమ్మురేపిం ...

జాతీయ బాస్కెట్‌బాల్‌ సబ్‌ జూనియర్‌ పోటీల్లో తెలంగాణ బాలికల జట్టు దుమ్మురేపింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్‌ -ఎఫ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొంది. బుధవారం ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 43-7తో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భువనేశ్వరి (9 పాయింట్లు), రాగమయి (8 పాయింట్లు), గౌతమి (6 పాయింట్లు) విశేషంగా రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో తెలంగాణ జట్టు 47-15తో బిహార్‌ను, 65-10తో అసోంను చిత్తు చేసింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.