(Local) Wed, 24 Jul, 2019

ఈ నెల 24న రాష్ట్ర స్థాయి క‌రాటే పోటీలు

February 15, 2019,   9:52 PM IST
Share on:

తెలంగాణ ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర స్థాయి పోటీల‌ను ఈ నెల 24న నిర్వ‌హించ‌నున్న‌ట్టు క‌రాటే ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ క‌ళ్యాణి నేడు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌ళ్యాణి ఆల్ రౌండ‌ర్ యూట్యూబ్ ఛాన‌ల్‌, ఆనంద‌ల‌హ‌రి సాంసృతిక సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో ఈ పోటీల‌ను ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల క‌రాటే పోటీల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. యూస‌ఫ్ గూడ లోని (ఒక‌ట‌వ బెటాలియ‌న్ ) తెలంగాణ స్పెషల్ పోలీస్  మంజీరా క‌మ్యూనిటీ హాల్ లో ఈ పోటీల‌ను ఉద‌యం 8 గంట‌ల నుండి సాయంత్రం 8 గంట‌ల వ‌రకు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. పోటీల‌లో పాల్గొనే క్రీడాకారుల‌కు ఇక్క‌డే భోజన వ‌స‌తి ఏర్పాట్లు చేశామ‌న్నారు. 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు నుండి 30 సంత్స‌రాల లోపు గ‌ల వారు ఈ పోటీల‌లో పాల్గొంటార‌ని ఆమె వివ‌రించారు.వ‌ర‌ల్డ్ పున‌కోషీ,షాటోఖాన్ క‌రాటే ఆర్గ‌నైజేష‌న్ రూల్స్ ప్ర‌కారం గ్రూపుల వారీగా ఈ పోటీల‌ను నిర్వ‌హించ‌నున్నామ‌న్నారు. బ్లాక్ బెట్ట్‌,బ్రౌన్ బెల్ట్ బాలురు,బాలిక‌ల విభాగంలో గ్రౌండ్ ఛాంపియ‌న్ షిప్ తోపాటు రూ. 1,116 న‌గ‌దును ఇస్తామ‌న్నారు. అలాగే క‌టా విభాగంలో కూడా గ్రౌండ్ ఛాంపియ‌న్ షిప్ ఉంటుంద‌న్నారు

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.