(Local) Wed, 21 Aug, 2019

కెరీర్ ని సెంచరీతో ముగించిన గంభీర్

December 09, 2018,   2:10 PM IST
Share on:

 ఏ క్రికెటర్‌కైనా ఇంతకంటే గొప్ప ముగింపు ఏముంటుంది. భారత వెటరన్‌ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ తన వీడ్కోలు మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ సెంచరీ కొట్టాడు.ఆంధ్రతో గ్రూప్‌-బి రంజీ మ్యాచ్‌లో గంభీర్‌ (185 బంతుల్లో 10 ఫోర్లతో 112) సెంచరీతో రాణించడంతో.. ఓవర్‌నైట్‌ స్కోరు 190/1తో మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఢిల్లీ ఆట చివరకు 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ గంభీర్‌ మరో 8 పరుగులు జోడించి శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే కెప్టెన్‌ ధ్రువ్‌ షోరె (98) రెండు పరుగులతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. వైభవ్‌ 33, జాంటీ సిద్దూ 30, లలిత్‌ యాదవ్‌ 29 రన్స్‌ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ 19 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 390 పరుగులు చేసింది. ఆటకు ఆదివారమే చివరి రోజు కావడంతో మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.