(Local) Wed, 24 Jul, 2019

కాంస్యం గెలిచిన కూలీ కొడుకు

October 18, 2018,   8:02 PM IST
Share on:

తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాకు చెందిన ప్రవీణ్‌ చిత్రవేల్‌ యూత్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. స్టేజ్‌-1లో 15.68 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచిన ప్రవీణ్‌.. స్టేజ్‌-2లో 15.84 పాయింట్లతో మూడో స్థానం సాధించాడు. ఉమ్మడిగా 31.52 మీటర్లతో అతను కాంస్య పతకానికి అర్హత సాధించాడు.క్యూబాకు చెందిన అలెజాండ్రో డయాజ్‌ (34.18 మీ.), నైజీరియా క్రీడాకారుడు ఇమ్మాన్యుయెల్‌ (31.85 మీ.) తొలి రెండు స్థానాలు సాధించారు. సవరించిన నిబంధనల ప్రకారం.. యూత్‌ ఒలింపిక్స్‌లో నాలుగు కి.మీ. క్రాస్‌కంట్రీ రేస్‌ మినహా ట్రాక్‌, ఫీల్డ్‌ మరే విభాగంలోనూ ఫైనల్స్‌ ఉండవు. ఒక్కో విభాగం పోటీని రెండుసార్లు నిర్వహిస్తారు. రెండు దశల ఫలితాల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. ప్రవీణ్‌ గెలుపొందిన కాంస్యంతో యూత్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌ ఖాతాలో రెండో పతకం చేరింది.పురుషుల 5 వేల మీటర్ల నడకలో సూరజ్‌ పన్వర్‌ రజతం గెలిచిన సంగతి తెలిసిందే.17 ఏళ్ల ప్రవీణ్‌ తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని ఓ పల్లెటూరికి చెందిన వాడు. అతడిది పేద కుటుంబం. తండ్రి దినసరి వ్యవసాయ కూలీ. ప్రవీణ్‌ ఈ ఏడాదే ఆరంభమైన ఖేలో ఇండియా పాఠశాల క్రీడల్లో స్వర్ణం గెలిచి వెలుగులోకి వచ్చాడు. సాయ్‌ కోచ్‌ ఇందిరా సింగ్‌ శిక్షణలో రాటుదేలి యూత్‌ ఒలింపిక్స్‌కు వెళ్లాడు. ఈ ఏడాది నిర్వహించిన తొలి ఖేలో ఇండియా పోటీల్లో స్వర్ణ పతకం అందుకున్న ప్రవీణ్‌.. కోచ్‌ ఇందిరా సింగ్‌ ఆధ్వర్యంలో తన నైపుణ్యానికి పదును పెట్టుకున్నాడు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.