(Local) Fri, 22 Nov, 2019

ఆకస్మాత్తుగా మైదానంలో క్రికెటర్‌కి గుండెపోటు

December 26, 2018,   2:07 PM IST
Share on:
ఆకస్మాత్తుగా మైదానంలో క్రికెటర్‌కి గుండెపోటు

దేశవాలీ క్రికెట్‌లో విషాదం జరిగింది. 24 ఏళ్ల ముంబై యువ క్రికెటర్ వైభవ్ కేసర్కార్... క్రికెట్ ఆడుతూ మైదానంలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయాడు. ముంబైలో జరుగుతున్న లోకల్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌‌లో భాగంగా మ్యాచ్ ఆడుతున్న వైభవ్ కేసర్కార్... గుండెనొప్పి రావడంతో గ్రౌండ్‌లో కుప్పకూలిపోయాడు. వైభవ్ గుండెనొప్పితో విలవిలలాడుతుండడం గమనించిన సహచర క్రికెటర్లు... అతన్ని వెంటనే దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వైభవ్ కేసర్కార్ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.