(Local) Fri, 22 Nov, 2019

ముంబయిలో క్రికెటర్ దారుణ హత్య

June 07, 2019,   12:31 PM IST
Share on:
ముంబయిలో క్రికెటర్ దారుణ హత్య

ముంబయిలో రాకేశ్ పన్వార్ అనే క్రికెటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ముంబయిలో ఉన్న ఓ పెట్రోల్ బంకులో ఉన్న రాకేశ్ పై ముగ్గురు దుండగలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేశ్ దేశవాళీ మ్యాచుల్లో రాణిస్తున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీల్లో పలుమార్లు రాకేశ్ విజేతగా నిలిశాడు. రాకేశ్ హత్యకు దారి తీసిన కారణాలు మాత్రం తెలియరాలేదు. పెట్రోల్ బంక్ లో ఉన్న సిసిటివి పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం రాకేశ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.