(Local) Mon, 22 Jul, 2019

తెలుగు టైటాన్స్‌ మరో విజయం

October 20, 2018,   12:10 PM IST
Share on:

ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్లో తెలుగు టైటాన్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన టైటాన్స్‌.. శుక్రవారం చక్కటి ప్రదర్శనతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పట్నా పైరేట్స్‌కు చెక్‌ పెట్టింది. జోన్‌-బిలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 35-33తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. టైటాన్స్‌ జట్టులో రాహుల్‌ చౌదరి (7 పాయింట్లు), విశాల్‌ భరద్వాజ్‌ (6), నిలేష్‌ (5), అబోజర్‌ (5) రాణించారు. పట్నాకు వరుసగా ఇది రెండో ఓటమి.

పైరేట్స్‌ జట్టులో మంజిత్‌ (8), విజయ్‌ (8), ప్రదీప్‌ (5) మెరిసినా ఓటమి తప్పలేదు. టైటాన్స్‌ 15 చొప్పున రైడ్‌, టాకిల్‌ పాయింట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన టైటాన్స్‌ 4-0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత పట్నా 8-6, 14-9తో పుంజుకుంది. అదే జోరుతో పైరెట్స్‌ 17-14తో బ్రేక్‌కు వెళ్లింది. విరామం తర్వాత పుంజుకున్న టైటాన్స్‌ 22-21, 26-21తో ముందంజ వేసింది. అయితే ఆఖర్లో పట్నా 30-30తో స్కోర్లు సమం చేసింది. మరో 3 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా టైటాన్స్‌ 5 పాయింట్లు సాధించి.. 35-33తో మ్యాచ్‌ను ముగించింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.