(Local) Wed, 24 Jul, 2019

‘ఉచిత పథకాల’పై కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

July 03, 2019,   1:33 PM IST
Share on:

ఎన్నికల ముందు,ఎన్నికల ప్రక్రియ సమయంలోను… ప్రత్యక్ష నగదు మార్పిడి పథకాలు, ఉచిత పథకాలను ప్రకటించకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని అడిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు కేంద్ర పథకాలైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇతర పథకాలను ప్రకటించాయి. ఇటీవలే ముగిసిన సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కొన్ని పార్టీలకు వాటివల్ల రాజకీయ ప్రయోజనం పొందాయని పిటిషన్ పేర్కొంది.

2019 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన నుంచి పోటీచేసిన పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సంక్షిప్తంగా విచారణ జరిపింది. అయిదు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఉచిత పథకాలు, నగదు ప్రత్యక్ష పంపిణీ, ఇతర పథకాల గురించి సమగ్రమైన మార్గదర్శకాలను కూడా రూపొందించాలని పిటిషనర్ చేసిన అభ్యర్థనను కూడా పరిశీలించాలని… న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ధబోస్ కూడా ఉన్న ధర్మాసనం నిర్ణయించింది. ఎన్నికల ముందు ఇలాంటి పథకాలను ప్రకటించడం అక్రమాలకు దారి తీస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు సంతోష్ పాల్, శరవణ్ కుమార్ వాదించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.