(Local) Sat, 06 Jun, 2020

తెలుగులోనూ సుప్రీం తీర్పులు

July 04, 2019,   1:33 PM IST
Share on:
తెలుగులోనూ సుప్రీం తీర్పులు

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సూచన మేరకు ప్రాంతీయ భాషల్లో తీర్పుకు అధికారులు కసరత్తు జరుపుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోందని, జులై నెలాఖరు కల్లా అమల్లోకి రావచ్చునని సంబంధిత అధికారులు తెలిపారు.
ప్రాంతీయ భాషల్లోనూ తీర్పులు అనువాదం చేయడానికి వీలుగా సాఫ్ట్ వేర్‌ను సుప్రీంకోర్టు అభివృద్ధి చేస్తోందని ఇటీవలే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి వెల్లడించారు. ఇంగ్లీషులో ఇచ్చే తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి..సుప్రీంకోర్టు అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరుస్తారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్ వేర్‌ను దేశీయంగా రూపొందించేందుకు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.