(Local) Mon, 16 Sep, 2019

నేడు శ్రీనగర్ కు ఏచూరి

August 29, 2019,   11:16 AM IST
Views: 53
Share on:
నేడు శ్రీనగర్ కు ఏచూరి

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి జమ్ముకశ్మీర్ కు  వెళ్లేందుకు సుప్రీంకోర్టు నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో గురువారం ఆయన శ్రీనగర్ బయల్దేరనున్నారు. తను పార్టీ నేత మహ్మద్ యూసఫ్ తరగామిని కలిసేందుకు రేపు కశ్మీర్ వెళ్లనున్నట్లు ఏచూరి తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై స్పందించిన ఆయన.. కశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే దీని గురించి మాట్లాడుతానని తెలిపారు. శ్రీనగర్ వెళ్లి తర్గామిని చూసేందుకు సుప్రీంకోర్టు నాకు అనుమతి ఇచ్చింది. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత తరిమి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక అందించాలని ఆదేశించింది. నేను తిరిగొచ్చి నివేదిక సమర్పించిన తర్వాత దీనిపై వివరంగా మాట్లాడతా' అని ఏచూరి ట్వీటర్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పలువురు రాజకీయ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. వారిలో సీపీఎం నేత యూసఫ్ తరిగామి కూడా ఉన్నారు. అయితే నిర్బంధంలో ఉన్న తరగామి అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఆయనను చూసేందుకు ఏచూరి వెళ్లగా.. ఆంక్షల పేరుతో పోలీసులు ఆడుకున్నారు. తరగామి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఏచూరి కశ్మీర్ కు  వెళ్లేందుకు అనుమతించింది. ఇక్కడికి వెళ్లిన తరవాత తరిగామిని మాత్రమే కలవాలని.. నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆదేశించింది. ఒకవేళ ఆదేశాలు ఉల్లఘించినట్లయితే నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.

సంబంధిత వర్గం
ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్న ...
ఫరూఖ్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నారో చెప్పండి -కేంద్రాన్న ...
కాశ్మీరు బయలుదేరిన రాహుల్ గాంధీ ఇతర  నాయకులు
కాశ్మీరు బయలుదేరిన రాహుల్ గాంధీ ఇతర నాయకులు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.